ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీలో ఉద్రిక్త పరిస్థితులు

విజయవాడ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. mbbs కౌన్సెలింగ్‌లో రిజర్వేషన్లు సక్రమంగా అమలు కాలేదని ఆరోపిస్తూ విద్యార్థి సంఘాలు వర్సిటీ ముట్టడికి పిలుపు ఇచ్చాయి. దీంతో, భారీగా పోలీసుల్ని మోహరించారు. భద్రతా వలయాన్ని దాటుకుని కొందరు విద్యార్థులు క్యాంపస్‌లోకి ఎంటర్ అయ్యారు. వాళ్లను పోలీసులు అడ్డుకోవడంతో వాగ్వాదం జరిగింది. చివరికి ఆందోళనకారుల్ని పోలీసులు అరెస్టు చేశారు.ఆగ్రహించిన ఓ విద్యార్థి నాయకుడు ఒంటిపై కిరోసిన్ పోసుకోవడంతో పోలీసులు అప్రమత్తం అయ్యారు. వెంటనే అతన్ని అడ్డుకున్నారు.