కామపిశాచిగా మారిన ఆస్పత్రి సూపర్‌వైజర్‌

ప్రకాశం జిల్లాలో ప్రభుత్వ ఆస్పత్రి సూపర్‌వైజర్‌ కామపిశాచిగా మారాడు. బల్లికురవ మండలం గుంటుపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని సూపర్‌వైజర్.. ANMలను వేధింపులకు గురిచేస్తున్నాడు. సమావేశాల పేరుతో ఒంటరిగా తన గదిలోకి రమ్మంటున్నాడని బాధితులు ఆరోపించారు. ఆస్పత్రి ముందు ఆందోళనకు దిగారు.

గుంటుపల్లి PHCలోని సూపర్‌వైజర్‌ వేధింపులు తట్టుకోలేక ఓ మహిళా ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. మరొకరు దీర్ఘకాల సెలవుపై వెళ్లారు. ఆయన అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడంటూ మహిళా సిబ్బంది ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు.