అమెరికాలో పశ్చిమగోదావరి జిల్లావాసి మృతి

west godhavari man suresh dies in america meriland

అమెరికాలో పశ్చిమగోదావరి జిల్లా వాసి మృతిచెందాడు. దెందులూరు మండలం పెరుగ్గూడెం గ్రామానికి చెందిన బోళ్ల వీర వెంకట సురేశ్‌(35) బీటెక్‌ పూర్తి చేసి అక్కడే రెనాల్ట్‌లో కొంతకాలం పని చేశారు. అనంతరం హైదరాబాద్‌ టీసీఎస్‌లో పనిచేసి రెండేళ్ల క్రితం ఆఫర్ రావడంతో అమెరికా వెళ్లారు. అమెరికాలోని మేరీల్యాండ్‌లో సాఫ్ట్‌‌వేర్ ఇంజనీరుగా పనిచేస్తున్నారు. అయితే నిన్న(ఆదివారం) స్వగ్రామంలో ఉంటున్న తల్లిదండ్రులకు సురేశ్‌ మృతిచెందాడన్న వార్త తెలిసింది. దీంతో వారు కన్నీరుమున్నీరవుతున్నారు.