‘మహానటి’ కీర్తీ సురేష్ భారీ విరాళం

actress-keerthi-suresh-donates-rs-15-lakhs-kerala-floods-victims

‘మహానటి’ సినిమాతో సూపర్ క్రేజ్ సంపాదించుకున్న మలయాళీ భామ కీర్తీ సురేష్ కేరళ వరద బాధితులకు తనవంతు సహాయం అందించింది. మొత్తం రూ.15 లక్షలు విరాళం ప్రకటించగా అందులో.. రూ.10 లక్షలు కేరళ సీఎం రిలీఫ్ ఫండ్‌కి, అలాగే ఆహారం, బట్టలు, మందుల కోసం మరో రూ.5 లక్షలు విరాళంగా ఇచ్చింది. అంతేకాకుండా త్రివేండ్రంలోని ఓ కళాశాలలో ఆశ్రయం పొందుతున్న బాధితులకు అవసరమైన వస్తువులను సరఫరా చేసింది. వరదల తాకిడికి ఇబ్బందులు పడుతున్న బాధితులకు సాయం చేసేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని కోరింది. ఇందుకు సంబంధించిన వీడియోలను తన ఫేస్‌బుక్ ఖాతా ద్వారా పంచుకుంది కీర్తీ.