ఈవారం ‘బిగ్‌బాస్‌’ హౌస్‌ ఎలిమినేటర్ ఎవరో తెలుసా?

బుల్లి తెరపై బిగ్‌బాస్ హంగామా రోజురోజుకీ రసవత్తరంగా మారుతుంది. ‘ఏదైనా జరగొచ్చు ఇంకొంచెం మసాలా’ అంటూ నేచురల్ స్టార్ నాని బిగ్ బాస్ సీజన్ 2ని చాలా డీసెంట్‌గా హ్యాండిల్ చేస్తున్నారు. ఈ షోలో సోమవారం నామినేషన్ల ఘట్టం ముగిసింది.ఈ వారం నామినేషన్స్‌లో కౌశల్, తనీష్, పూజా రామచంద్రన్, దీప్తి నల్లమోతు ఉన్నారు. లాస్ట్ వీక్ రోల్ రైడా కారణంగా నామినేషన్స్ నుంచి తప్పించుకున్న గణేష్ ఈ వారం ఎలిమినేషన్ జోన్‌లోకి వస్తాడని భావించారంతా. కానీ హౌస్‌లో ఏదైనా జరగొచ్చు కదా! ఈ రియాలిటీ షోకి ఇంకొంచెం మసాలా కోసం హౌస్ సభ్యులు కాస్త స్ట్రాంగ్ కంటెస్టెంట్స్‌ని ఎంచుకున్నారు.

దీంతో ఇప్పుడు అందరి చూపు కౌశల్ పైనే పడింది. ఎవరున్నా ఎవరు లేకున్నా.. కౌశల్ మాత్రం హౌస్‌లో ఉండాలని భావిస్తున్నారు అతని అభిమానులు. దీంతో తమ స్టామినా మొత్తం ఉపయోగించి కౌశల్‌ని ఎలిమినేషన్ నుంచి గట్టెక్కించే అవకాశాలు ఉన్నాయి. ఇక తనీష్‌కి కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ బాగానే ఉంది. వాళ్లంతా తమ కంటెస్టెంట్‌ని కాపాడుకోవడం పైనే దృష్టి పెడతారనటంలో సందేహం లేదు. ఇక మిగిలింది దీప్తి, పూజ. వీరిద్దరిలో దీప్తి సేవ్ అవడానికి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. దీంతో ఈ వారం ఎలిమినేట్ అయ్యే అవకాశం ఎక్కువగా పూజాకే ఉందని బుల్లితెర ప్రేక్షకులు గుసగుసలాడుకుంటున్నారు.