వరదల ప్రభావం.. పెళ్లి వాయిదా వేసుకున్న నటుడు

actor-postponed-wedding-help-rescue-operations

కేరళ వరద విలయం క్రమంగా తగ్గుముఖం పడుతోంది. రెండు వారాలుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు కేరళ అతలాకుతలం అయింది. పేద, ధనిక బేధం లేకుండా లక్షలాది మంది వరద బాధితులుగా మారారు. అయితే ఈ జాబితాలోకొందరు సినిమా నటీనటులు కూడా ఉన్నారు. అందులో ముఖ్యంగా మలయాళ నటుడు రాజీవ్‌ పిళ్లై వరదల కారణంగా తన పెళ్లిని వాయిదా వేసుకుని సహాయక చర్యల్లో పాల్గొన్నాడని ఈ మేరకు అయన స్నేహితుడు రిచా చాదాతన ఇన్‌స్టాగ్రామ్‌లో పేర్కొన్నారు. ‘నా స్నేహితుడు.. కోస్టార్‌ రాజీవ్‌ తన వివాహాన్ని వాయిదా వేసుకున్నాడు. తన హోం టౌన్‌ నన్నూర్‌లో వరదల్లో చిక్కుకున్నవారిని కాపాడెందుకు సహాయక చర్యల్లో పాల్గొంటున్నాడు. లోతట్టు ప్రాంతాల్లో ప్రజలను బోట్స్‌ సాయంతో సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నాడు. నా స్నేహితుడు చేసే పనిపట్ల గర్వంగా ఫీలవుతున్నాను’ అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో పేర్కొన్నారు. కాగా రాజీవ్‌ పిళ్లై ఇటీవలే నటుడిగా మారాడు. ఇంజనీరింగ్‌ విద్యార్థి అజితాను వివాహం చేసుకోవాల్సింది.. కానీ వరదల నేపథ్యంలో పెళ్లి వాయిదా వేసుకున్నాడు రాజీవ్‌.