లైంగిక వేధింపుల కేసు ఉపసంహరించుకోలేదని యువతి హత్య

dalith-girl-murdered-madhya-pradesh

తనపై పెట్టిన లైంగిక వేధింపుల కేసును వెనక్కితీసుకోవడం లేదనే కోపంతో ఓ వ్యక్తి యువతిని హత్య చేశాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లో జరిగింది. సియోనికి చెందిన అనిల్‌మిశ్రా(38) పై ఇటీవల లైంగిక వేధింపుల కేసు నమోదయింది. దీంతో కేసు ఉపసంహరించుకోవాలని కొంతకాలంగా యువతి (23)ని వేధిస్తున్నాడు అనిల్‌మిశ్రా. ఈ క్రమంలో సోమవారం మధ్యాహ్నం కళాశాలకు వెళ్తుండగా ద్విచక్ర వాహనంపై వచ్చి ఆమెపై ఒక్కసారిగా దాడి చేశాడు. అనంతరం ఆమె జుట్టు పట్టుకుని లాక్కెళ్లి రాయితో తలపై మోది చంపేశాడు. ఆమె చనిపోయిందని నిర్ధారించుకున్న తరువాత నిందితుడు అక్కడినుంచి పరారయ్యాడు. కాగా సమాచారం అందుకున్న పోలీసులు అనిల్‌మిశ్రాపై కేసు నమోదు చేసి అతన్ని అరెస్టు చేసి దర్యాప్తు ప్రారంభించారు.