భార్యా పిల్లల బాడీలను ఫ్రిడ్జ్‌లో, సూట్ కేసులో.. భర్త ఫ్యానుకు వేలాడుతూ..

ఢిల్లీ బురారీ ఘటనను మరవకముందే యూపీలో అలాంటిదే మరో ఘటన చోటు చేసుకుంది. అలహాబాద్ దమన్ గంజ్‌కు చెందిన ఓ కుటుంబం మొత్తం శవాలుగా కనిపించారు. భార్య శవం ఫ్రిడ్జ్‌లో ఉండగా, ఒక కూతురి శవం సూట్ కేసులో, మరో కూతురి శవం రూమ్‌లో, ఇంకో అమ్మాయిది అల్మారాలో ఉంది. భర్త బాడీ ఫ్యానుకు వేలాడుతూ కనిపించింది.

ఈ మేరకు సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగి దర్యాప్తు చేపట్టారు. భార్యా పిల్లలను భర్తే హత్య చేసి ఉండవచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆ తరువాత భర్త ఉరి వేసుకుని ఉంటాడని భావిస్తున్నారు ఎస్పీ నితిన్ తివారీ. స్థానికులు అందించిన సమాచారం మేరకు భార్యా భర్తలిద్దరూ తరచూ గొడవలు పడుతుండేవారని చెబుతున్నారు.

మరింత లోతుగా విచారణ చేపట్టిన అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని పోలీసులు అంటున్నారు. పోస్ట్ మార్టం నిమిత్తం డెడ్ బాడీలను హాస్పిటల్‌కు తరలించారు.

- ఉచితంగా మీ జాతకాన్ని తెలుసుకోండి -