టాటా స్కై ఇంటర్నెట్ ఆఫర్లు చూస్తే..

jio-gigafiber-tata-sky-broadband-plans-india-100mbps-speed-in-12-cities-price-2500

టెలికామ్ దిగ్గజం రిలయన్స్ జియో.. త్వరలో జియో గిగాఫైబర్ బ్రాడ్ బ్యాండ్ సర్వీస్ అందుబాటులోకి తేనుంది. ఇందుకోసం ఆగస్ట్ 15 నుంచి రిలయన్స్ జియో తన అధికారిక వెబ్ సైట్ ద్వారా జియో గిగాఫైబర్ రిజిస్ట్రేషన్లు ప్రారంభించింది. అయితే డీటీహెచ్ సర్వీస్ దిగ్గజం టాటా స్కై జియో గిగాఫైబర్ కి సవాల్ గా మారింది. రిలయన్స్ జియో గిగాఫైబర్ సర్వీస్ ప్రారంభానికి ముందే టాటా స్కై బ్రాడ్ బ్యాండ్ సేవలు 12 నగరాల్లో తన సేవలు ప్రారంభించింది. ముంబై, ఢిల్లీ, ఘాజియాబాద్, గుర్గావ్, నోయిడా, పూణె, భోపాల్, చెన్నయ్, బెంగుళూరు, అహ్మదాబాద్, మీరా భాయందర్ లలో టాటా స్కై బ్రాడ్ బ్యాండ్ సేవలు అందుబాటులో ఉన్నాయి. అయితే టాటా స్కై బ్రాడ్ బ్యాండ్ సేవలు.. వినిగదారులు ఉంటున్న ఏరియాల్లో కావాలనుకుంటే కంపెనీ అధికారిక వెబ్ సైట్ లోని ఆన్ లైన్ ఫామ్ నింపితే సేవల లభ్యత వివరాలు తెలుస్తాయి. దాని ప్రకారం టాటా స్కై బ్రాడ్ బ్యాండ్ సేవలు పొందవచ్చు. ప్రస్తుతం టాటా స్కై బ్రాడ్ బ్యాండ్ డేటా ప్యాకేజి లు 1,3,5,9,12 నెలలుగా ఉంటే..

ఆఫర్లు ఇలా ఉన్నాయి.. రూ.999కి 5ఎంబీపీఎస్ స్పీడ్, అలాగే రూ.1,150కు 10 ఎంబీపీఎస్, రూ.1,500 కి 30ఎంబీపీఎస్, రూ.1,800కు 50ఎంబీపీఎస్, రూ.2,500కి 100 ఎంబీపీఎస్, ఇవి కాకుండా నెలకు 60జీబీ డేటా ప్లాన్ రూ.999కి, 125జీబీ డేటా ప్లాన్ రూ.1,250కి లభ్యమవుతాయి. అయితే వీటిలో అన్ లిమిటెడ్ డేటా రానుంది. మొదట
ఇన్ స్టాలేషన్ ఛార్జీ కింద రూ.1,200 చెల్లించాల్సి ఉంటుంది. ఇందులో వైఫై రూటర్ ఉచితంగా లభించనుంది.