ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు స్పాట్‌లోనే..

road, accident, car, lorry

చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శాంతిపురం మండలం, కడుపల్లి దగ్గర ప్రమాదం చోటు చేసుకుంది. మారుతీ జెన్‌ కారును.. లారీ ఢీ కొనడంతో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరొకరికి తీవ్ర గాయాలు అయ్యాయి. మారుతీ కారులో తిరుమల శ్రీవారి దర్శనం తరువాత తిరుగు ప్రయాణంలో ఈ ప్రమాదం జరిగింది. మృతులను తమిళనాడు రాష్ట్రం, ధర్మపురికి చెందిన వారుగా గుర్తించారు. గాయపడిన వ్యక్తిని కుప్పం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.