ప్రమాదానికి గురైన ఆర్టీసీ బస్సు.. ఐదుగురి పరిస్థితి విషమం

rtc-bus-accident-in-nellore-distric


నెల్లూరు జిల్లాలో ఓ ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురైంది. ఇందులో ప్రయాణిస్తున్న 17 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది. చిల్లకూరు పోలీస్‌ స్టేషన్‌ వద్ద ఈ రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. తిరుపతి నుంచి నెల్లూరు వెళ్తున్న నాన్‌స్టాప్‌ బస్సు.. లారీని వెనుక నుంచి ఢీకొట్టింది. బస్సు డ్రైవర్ క్యాబిన్‌లో ఇరుక్కుపోవడంతో.. పోలీసులు, స్థానికులు అతి కష్టంపై బయటకు తీశారు. క్షతగాత్రులను గూడూరు ఏరియా ఆస్పత్రికి తరలించారు. ప్రయాణికులు దైవదర్శనం చేసుకుని.. తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది.