పన్నెండు అంతస్తుల భవనంలో భారీ అగ్నిప్రమాదం

ముంబయిలోని పరేల్‌ ప్రాంతంలో భారీ అగ్నిప్రమాదం కలకలం రేపింది. క్రిస్టల్‌ టవర్‌ అపార్ట్‌మెంట్‌లో మంటలు చెలరేగాయి. హింద్‌మాతా సినిమాస్‌కు సమీపంలోని ఎత్తైన భవనంలో ఈ ప్రమాదం జరిగింది‌. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. పలువురు గాయపడ్డారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది దాదాపు 20 అగ్నిమాపక యంత్రాలతో ఘటనాస్థలానికి చేరుకుని మంటలు ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. మంటల కారణంగా భవనం నుంచి దట్టమైన పొగలు వస్తున్నాయి.

అపార్ట్‌మెంట్‌ పన్నెండో అంతస్తులో మంటలు చెలరేగి వేగంగా వ్యాపించినట్లు అగ్నిమాపక అధికారులు తెలిపారు. పై అంతస్తులో చాలా మంది చిక్కుకుపోయారు. దీంతో సిబ్బంది క్రేన్ల సాయంతో వారిని బయటకు తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే లోపల ఎంతమంది చిక్కుకుపోయారో తెలియరాలేదు.

- ఉచితంగా మీ జాతకాన్ని తెలుసుకోండి -