బిగ్‌బాస్ హౌస్‌లో రంగమ్మత్త.. తాంబూలంతో ఎంట్రీ

anchor ansuya

బుల్లి తెరపై బిగ్‌బాస్ రియాలిటీ షో రోజురోజుకీ రసవత్తరంగా మారుతుంది. హౌస్‌లోకి అప్పుడప్పుడు కొందరు సెలబ్రెటీలు ఎంట్రీ ఇచ్చి ఈ షోకి మరింత జోష్‌ని తీసుకువస్తున్నారు. తాజాగా బిగ్‌బాస్ హౌస్‌లోకి అనసూయ తాంబూలంతో ఎంట్రీ ఇచ్చింది. ఈ రంగమ్మత్త ఎంట్రీతో హౌస్‌లో సందడి రెట్టింపైంది.

మంగళవారం హౌస్‌లో పెళ్లి వేడుక జరిగింది. ఈ వేడుక జరుగుతున్న సమయంలో అనసూయ తాంబూలంతో ఎంట్రీ ఇచ్చి అందరినీ ఆకట్టుకుంది. మెహందీ కార్యక్రమంలో సందండి అంతా ఇంతా కాదు.. ఈ వేడుకతో పాటు ఆటల పోటీలు కూడా అందరినీ ఆకట్టుకున్నాయి. ఇక సామ్రాట్, దీప్తిలు స్విమ్మింగ్ పూల్‌లోకి దూకి ఉంగరాలు వెతికి తీయడం, మరో టీమ్ వాళ్లు బూట్ల జతలను వెతకడం బుల్లితెర ప్రేక్షకులకు సరదాగా అనిపించింది. బుధవారం షో లో సంగీత్, పెళ్లి వేడుక జరుగనున్నాయి. ఈ సంగీత్‌లో రంగమ్మత్త చేసే రచ్చ చూడడం కోసం ప్రేక్షకులు ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.