అక్రమ సంబంధం.. రెడ్‌హ్యాండెడ్‌‌గా పట్టుబడిన భర్త

అక్రమ సంబంధం పెట్టుకున్న భర్తను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని చితకబాదింది అతని భార్య. వేములవాడ మండలం చెక్కపల్లి గ్రామంలో స్కూల్ అసిస్టెంట్ గా చేస్తున్న ఆలువాలు సత్యనారాయణ..మరో మహిళలతో అక్రమ సంబంధం కొనసాగిస్తున్నాడు. ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా ఉంటూ పాడు బుద్ధి చూపించిన భర్తపై భార్య పద్మకు అనుమానం వచ్చింది. దీంతో అతని వ్యవవాహారం విచారించిన పద్మ..భర్త సంధ్య అనే మహిళతో వివాహేతర సంబంధం నడుపుతున్నట్లు నిర్దారణకు వచ్చింది. ఇద్దరిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుందామె.

కట్టుకున్న భర్త తరచూ ఇంటికి రాకపోవటంతో పాటు..ఇంట్లో డబ్బు, నగలు మాయం అవుతుండటంతో పద్మకు అనుమానం కలిగించింది. డబ్బు, నగలు మాయం అవటం భర్త పనే అని గ్రహించిన పద్మ..అతని కదలికలపై ఆరా తీసింది. సిరిసిల్ల వెంకంపేటలో గుట్టుగా వివాహేతర సంబంధం కొనసాగిస్తున్న సంగతి తెల్సుకుని..తన బంధులను వెంట తీసుకెళ్లింది. సంధ్య, సత్యనారాయణలను పట్టుకొని చితకబాదిందామె.

అయితే..సంధ్య మాత్రం తమ వ్యవహారం పద్మకు ఎప్పుడో తెలుసని అంటోంది. ఆమె కావాలనే రాద్దాంతం చేస్తోందని ఆరోపిస్తోంది. గర్భంతో ఉన్న తనతో పాటు తన తల్లిని కొట్టారంటూ ఆవేదన వ్యక్తం చేశారామె. ఏది ఏమైనా సత్యనారాయణను విడిచి ఉండే ప్రసక్తే లేదని అంటోంది సంధ్య.