కేరళ వరద బాధితులకు కోహ్లీసేన విరాళం

kohili donates, kerala flood

నాటింగ్ హామ్ వేదికగా ముగిసిన మూడో టెస్టులో కోహ్లీసేన గ్రాండ్ విక్టరీ కొట్టింది.521 పరుగుల భారీ టార్గెట్‌తో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ నాలుగోరోజు ఆరంభంలోనే 4 కీలక వికెట్లు కోల్పోయినా… బట్లర్,స్టోక్స్ పార్టనర్‌షిప్‌తో కోలుకుంది. అయితే నాలుగోరోజు చివరి సెషన్‌లో బూమ్రా ధాటికి ఇంగ్లాండ్ వరుస వికెట్లు చేజార్చుకుంది. చివరి వికెట్‌ను ఇవాళ తొలి సెషన్‌లోనే భారత్ పడగొట్టి విజయాన్ని అందుకుంది. మూడో టెస్టులో సమిష్టిగా రాణించిన కోహ్లీసేన ఇంగ్లాండ్‌ను చిత్తు చేసింది.

ఈ విజయంలో కీలకమైన కెప్టెన్ విరాట్ కోహ్లీకి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. అయితే ఈ మ్యాచ్ విజయాన్ని వరదలతో కొట్టుమిట్టాడుతున్న కేరళ బాధితులకు అంకితం ఇస్తున్నట్లు విరాట్ కోహ్లీ ప్రకటించాడు. అంతేకాక.. ఈ మ్యాచ్‌లో తమకు అందిన 1.26 కోట్ల ప్రైజ్ మనీని కేరళ వరద బాధితులకు విరాళంగా ఇస్తున్నట్లు టీం ఇండియా ప్రకటించింది.