ఏఆర్ రెహమాన్ గొంతులో కేరళ విషాదం.. వైరల్

రాష్ట్రమేదైనా బాధ అందరిదీ. ప్రతి ఒక్కరినీ కలిచి వేస్తున్న హృదయ విదారక దృశ్యాలు. త్వరగా కోలుకోవాలంటూ ప్రార్థనలు. చేతనైనంత సాయం అందించే ఆపన్న హస్తాలు. వరదల్లో చిక్కుకున్న కేరళ వాసులకు ధైర్యం చెబుతూ మేమున్నామంటూ భరోసా ఇస్తూ పాటను ఆలపించారు ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్.

ప్రేమదేశం చిత్రంలోని ‘ముస్తఫా ముస్తఫా’ పాటను పేరడీగా చేసి కేరళ.. కేరళ.. డోన్ట్ వర్రీ కేరళ అంటూ పాటను తన గొంతులో పలికించారు. ప్రస్తుతం రెహమాన్ అమెరికాలో కచేరీలతో బిజీగా ఉన్నారు.

 

లాస్‌ఏంజెల్స్‌లోని కచేరీలో పాల్గొన్న రెహమాన్ కేరళ వాసులకు ధైర్యం చెబుతూ ఈ పాటను పాడి వారికి అంకితమిచ్చారు.