ప్రియుడితో కలిసి కన్న కొడుకును కడతేర్చిన కసాయి తల్లి

వివాహేతర సంబంధం కోసం మాతృత్వాన్ని మంటకలిపింది ఓ కన్నతల్లి.. తన అక్రమ సంబంధానికి అడ్డు వస్తున్నాడని కన్న కొడుకునే కడతేర్చింది.. కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన కన్న తల్లి రాక్షసిగా మారి ప్రాణాలు తీసింది. మానవ సంబంధాలను మంటగలిపేలా ఉన్న.. ఈ దారుణమైన ఘటన విజయనగరం పట్టణంలోని గాయత్రీ నగర్‌లో చోటు చేసుకుంది.

వెంకట పద్మావతి అనే మహిళ… తన కొడుకు హరి భగవాన్‌ను కిరాతకంగా హతమార్చింది. శ్రీ చైతన్య కాలేజ్‌లో సెకెండియర్‌ చదువుతున్న హరిభగవాన్‌కు రాత్రి తిన్న ఆహారంలో నిద్రమాత్రలు కలిపి పెట్టింది ఆ తల్లి.. విషయం తెలియక ఆ ఆహారం తిని.. హ్యాపీగా నిద్రపోయాడు హరి.. కాని అదే శాశ్వత నిద్ర అవుతుందని ఊహించలేకపోయాడు.

నిద్ర మాత్రలు ఇచ్చిన తరువాత కూడా కన్నతల్లి మనసు చలించలేదు. హరి భగవాన్ నిద్రలోకి జారుకున్న తరువాత.. ప్రియుడితో కలిసి కొడుకు మెడకు చున్నీ గట్టిగా చుట్టి హత్య చేసింది. తన వివాహేతర సబంధానికి కొడుకు అడ్డుపడుతున్నాడనే ఒక్క కారణంతో పద్మావతి దారుణానాని ఒడిగట్టిందని పోలీసులు అనుమానిస్తున్నారు. ఇప్పటికే ఆమెను అదుపులోకి తీసుకుని విచారిస్తున్న పోలీసులు.. ప్రియుడు గోవింద్‌ పాత్రపైనా విచారిస్తున్నారు.