ఆసియా క్రీడల షూటింగ్‌లో భారత్‌కు మరో స్వర్ణం

rahi sarnobat

ఆసియా క్రీడల్లో భారత షూటర్ల జోరు కొనసాగుతోంది. తాజాగా 25 మీటర్ల పిస్టల్ ఈవెంట్‌లో రాహి సర్నబోత్‌ స్వర్ణం కైవసం చేసుకుంది. హోరాహోరీగా సాగిన ఫైనల్లో ఆమె థాయ్‌లాండ్ షూటర్‌పై గెలిచి అగ్రస్థానంలో నిలిచింది. ఈ ఆసియా క్రీడల షూటింగ్‌లో భారత్‌కు ఇది రెండో స్వర్ణం. ఓవరాల్‌గా భారత్‌కు ఇది నాలుగో గోల్డ్ మెడల్‌. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో భారత్ 4 బంగారు, 3 రజతాలు, 4 కాంస్యాలతో ఆరో స్థానంలో కొనసాగుతోంది.