బిగ్‌బాస్ హౌస్‌లోకి అడల్ట్ స్టార్.. వారానికి రూ.95 ల..క్షలు

బిగ్‌బాస్ షోని మరింత ఆసక్తికరంగా మలిచేందుకు మరి కొంత మంది స్టార్లను హౌస్‌లోకి తీసుకురానున్నారు షో నిర్వాహకులు.

బాలీవుడ్ హీరో సల్మాన్ వ్యాఖ్యాతగా వ్యవహరించబోతున్న 12వ సీజన్ కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈసారి షోలో బ్రిటీష్ పోర్న్ స్టార్ డెన్నీడీ, అతని గర్ల్‌ఫ్రెండ్ మహికా శర్మలు పాల్గొననున్నట్లు తెలుస్తోంది.

షోకోసం వీరు డిమాండ్ చేసే పారితోషికం కూడా భారీగానే ఉన్నట్లు సమాచారం. వారానికి రూ.95 లక్షలతో డీల్ కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. మరి వీరి ఎంట్రీతో హౌస్‌లో ఎలాంటి వాతావరణాన్ని సృష్టిస్తారో చూడాలి.