టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే సోదరుడి అనుమానాస్పద మృతి

టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌ సోదరుడు గంగుల ప్రభాకర్‌ అనుమానాస్పదస్థితిలో మృతిచెందారు. మార్నింగ్ వాకింగ్ కోసం కరీంనగర్‌ శివారులోని రేకుర్తి వంతెనపైకి వెళ్ళిన ప్రభాకర్‌ రోడ్డు పక్కన విగితాజీవిగా పడి ఉండటం స్థానికులు గుర్తించారు.వేంటనే వారు పోలీసులకు
సమాచారం అందించారు. దీంతో ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కరీంనగర్‌ ప్రభుత్వాసుపత్రికి తరలించారు.వాకింగ్‌ వెళ్లిన సమయంలో అకస్మాత్తుగా గుండెపోటు వచ్చి మృతిచెంది ఉండవచ్చునని పోలీసులు అనుమానిస్తున్నారు.