మహిళపై కారు ఎక్కించి చోరీకి పాల్పడ్డ దుండగులు

ఆమెరికాలోని హ్యూస్టన్‌ నగరంలో దోపిడి దోంగలు బీభత్సం సృష్టించారు. బ్యాంకులో నగదు డ్రా చేసుకోని బయటకు వస్తున్న ఓ మహిళను వెంబడించి ఆమెను తీవ్రంగా గాయపరిచి నగదు దోచుకేళ్ళారు. బ్యాంకులో నుంచి నగదును తీసుకోని ఆమె కార్యలయానికి వెళ్తున్న సమయంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. ఆమె కారును వెంబడిస్తూ వెళ్ళిన దోంగ మహిళ చెందిన వలేరో గ్యాస్‌ స్టేషన్‌ వద్దకు రాగానే ఆమె బ్యాగులాక్కెళ్లడానికి ప్రయత్నించాడు. ఆ మహిళ తీవ్రంగా ప్రతిఘటించడంతో వారు మధ్య కాసేపు పెనుగులాట చోటుచేసుకుంది.ఇంతలోనే దుండగులకు చెందిన మరో కారు కూడా అక్కడికి వచ్చింది. కారులో నుంచి దిగిన మరో దోంగ.. మహిళ, అమె భర్తపై దాడికి పాల్పడ్డాడు. పారిపోతున్న సమయంలో మహిళపై కారు ఎక్కించారు. దీంతో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. చోరీకి పాల్పడిన దోంగను పోలీసులు వెంబడించి పట్టుకున్నారు. మరో దోంగ కోసం గాలిస్తున్నారు. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మహిళ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. దీని సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.

- ఉచితంగా మీ జాతకాన్ని తెలుసుకోండి -