కేరళ వరద బాధితులకు లారెన్స్ భారీ సాయం..

acter raghava lawrence i crore rupee donation for kerala flood

కష్టాల్లో ఉన్న పేదవారికి సాయం చెయ్యడంలో ఎప్పుడు ముందుంటాడు హీరో కం డ్యాన్సర్ రాఘవ లారెన్స్. కేరళ వరద బాధితులకు తనవంతుగా కోటి రూపాయలు సాయమందించారు. అలాగే బియ్యం, కూరగాయలు కూడా కేరళకు పంపించారు. కాగా 10 రోజులపాటు ఎడతెరిపి లేని వర్షాలకు కేరళ అతలాకుతలం అయింది. ప్రపంచ నలుమూలల నుంచి కేరళకు ఆపన్న హస్తం అందుతోంది. కేరళ ప్రజల పరిస్థితి చూసి ప్రముఖులు తమకు తోచిన సాయం అందిస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి ఫ్యామిలీ కోటి రూపాయలు, రజినీకాంత్ 15 లక్షలు, కమల్ 25 లక్షలు, సూర్య, కార్తి 25లక్షలు, విశాల్ 10 లక్షలు, అల్లు అర్జున్ 25 లక్షలు, విజయ్‌ సేతుపతి 25 లక్షలు, ధనుష్‌ 15 లక్షలు, సిద్ధార్థ్‌ 10 లక్షలు, దర్శకుడు శంకర్‌ 10 లక్షల రూపాయల ఆర్థిక సాయం ప్రకటించారు. మరోవైపు తమిళ నటులతో పాటు మలయాళం నటులు మోహన్‌ లాల్‌, మమ్ముట్టి, దుల్కర్‌ సల్మాన్‌ కేరళ వరద బాధితులకు తమ వంతు సహాయాన్ని ప్రకటించారు. అంతేకాకుండా మలయాళ మూవీ ఆర్టిస్ట్స్‌ (అమ్మా) 10కోట్ల రూపాయలను కేరళ సీఎం సహాయ నిధికి విరాళమిస్తున్నట్టు ప్రకటించింది.