సన్నాఫ్ సత్యమూర్తి హీరోయిన్ ఇలా సెటిల్ అయిందేంటి..?

adah-sharma-shocking-transformation-hollywood-film

‘ఆదాశర్మ’ తెలుగింటి అమ్మాయి అయినా.. బాలీవుడ్ లో రాణిస్తూ అక్కడే స్థిరపడింది. లవర్ బాయ్ నితిన్ సరసన హార్ట్ ఎటాక్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. ఆ తరువాత సన్నాఫ్ సత్యమూర్తి, గరమ్‌ లాంటి సినిమాల్లో నటించినా పెద్దగా క్రేజ్ రాలేదు. అయితే అడవి శేష్ హీరోగా తెరకెక్కిన క్షణం లో నటించి మంచి మార్కులే కొట్టేసింది. ప్రస్తుతం టాలీవుడ్‌కు గుడ్ బై చెప్పేసి బాలీవుడ్‌ బాట పట్టింది. అయితే ఆదాశర్మ త‍్వరలో ఓ హాలీవుడ్‌ సినిమాలో నటించనుంది. ఆ సినిమాలో ఆదా ఈ డీగ్లామర్‌ లుక్‌లో కనిపించనుంది. అందుకోసం ఇటీవల ఫొటో షూట్ కూడా చేసినట్టుగా తెలుస్తోంది. అందులో ఆదాశర్మ రోడ్డు పక్కన బాగా మాసి, చినిగిన చీరకట్టుకొని నిద్రలేమితో, అలసిపోయినట్టుగా కూరగాయలమ్ముతున్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇది తెలియని ఆమె అభిమానులు అయ్యో ఏంటి ఆదా ఇలా సెటిల్ అయ్యింది అని అనుకుంటున్నారు.