యాపిల్ కంపెనీలో ఉద్యోగాలు.. 1500 మందికి అవకాశం

హైదరాబాద్‌ నగరంలో ఉన్న ఐటీ కంపెనీ యాపిల్ తన సంస్థలో సేవలందించేందుకు గాను కొత్తగా మరో 1500 మంది ఉద్యోగులను తీసుకునేందుకు సన్నాహాలు చేస్తోంది. ప్రస్తుతం ఉన్న 3,500 మంది ఉద్యోగుల సంఖ్యను 5 వేలకు పెంచాలని నిర్ణయించుకుంటున్నట్లు తెలంగాణ ఐటీ శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి జయేష్ రంజన్ వెల్లడించారు.

హైదరాబాద్‌లో పాక్టెరా టెక్నాలజీస్ డెవలప్‌మెంట్ కేంద్రం ప్రారంభించిన సందర్భంగా ఈ విషయాన్ని రంజన్ తెలియజేశారు.