రెజీనాతో రొమాన్స్‌ చేస్తున్న స్టైలిష్ విలన్

rezina, arvind swamy

1990 దశకంలో తెలుగు, తమిళ భాషల్లో హీరోగా సూపర్‌ క్రేజ్‌తో దూసుకెళ్లాడు అందాల నటుడు అరవింద్ స్వామి. నిన్నటితరం నటుడిగా అభిమానుల్లో మంచి క్రేజ్ తెచ్చుకున్న ఈ హీరో లేటు వయసులో కూడా యంగ్ హీరోయిన్లతో రొమాన్స్ చేస్తూ యువ హీరోలకు సైతం అసూయ కలిగిస్తున్నాడు. జయంరవి హీరోగా మోహన్‌రాజా దర్శకత్వంలో వచ్చిన ‘తనీ ఒరువన్’ (తెలుగులో ధృవ)లో అరవింద్‌స్వామి స్టైలిష్‌ విలన్‌గా అదరగొట్టి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. ఈ మూవీ తర్వాత హీరో పాత్రలు ఆయన్ను వెతుక్కుంటూ వచ్చాయి.

ప్రస్తుతం రాజపాండి దర్శకత్వంలో నటించేందుకు ఆయన గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చారు. సస్పెన్స్‌ థ్రిల్లర్‌ కథతో రూపొందనున్న ఆ మూవీలో అరవింద్‌స్వామికి జోడీగా అందాల తార రెజీనాను ఎంపిక చేశారు. సో.. రెజీనాతో రోమాన్స్ చేయటానికి రెడీ అయ్యాడు ఈ స్టైలిష్‌ విలన్‌. ఇక మణిరత్నం దర్శకత్వంలో ఓ మల్టీస్టారర్‌ మూవీలో కూడా నటించనున్నట్లు సమాచారం. ఈ స్టైలిష్‌ విలన్‌ కం హీరో నటించిన ‘నరకసూరన్‌’, ‘చదురంగవేట్టై 2’ చిత్రాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.

Recommended For You

Leave a Reply

Your email address will not be published.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.