మళ్ళీ కోహ్లియే నంబర్ వన్

భారత కేప్టెన్ విరాట్ కోహ్లి మరోసారి నంబర్ వన్ ర్యాంక్‌ను సొంతం చేసుకున్నాడు. మెుదటి స్థానంలో ఉన్న ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్‌ను వెనక్కి నెట్టి అగ్రస్థానాన్ని ఆక్రమించాడు. ఇంగ్లండ్‌తో జరిగిన మూడో టెస్ట్‌లో 200 పరుగులు సాధించి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్‌గా నిలిచాడు.దీంతో తాజా ర్యాంకింగ్స్‌లో కోహ్లి నంబర్ వన్ ర్యాంక్‌లో నిలిచాడు. ప్రస్తుతం కోహ్లి టేస్టే బ్యాట్స్‌మెన్ ర్యాకింగ్‌లో 937 పాయింట్లతో ప్రథమ స్థానంలో ఉన్నాడు. రెండో టెస్ట్ తర్వాత కోల్పోయిన ర్యాంక్.. చివరి  టెస్ట్‌తో తిరిగి సొంతం  చేసుకున్నాడు.