సెల్‌ఫోన్‌కు ఛార్జింగ్ పెడుతూ వ్యక్తి మృతి

cell-phone-charging-man-death-nellore

సెల్‌ఫోన్‌కు ఛార్జింగ్ పెడుతూ ప్రమాదవశాత్తు వ్యక్తి మృతిచెందాడు. ఈ ఘటన నెల్లూరు జిల్లా రాపూరు మండలం గిలకపాడులో జరిగింది. గ్రామానికి చెందిన చలంచర్ల మణి(36) మంగళవారం రాత్రి తన సెల్‌ ఫోన్‌కు చార్జింగ్‌ పెట్టేందుకు చార్జర్‌ను తీసుకున్నాడు. చార్జర్‌ను ప్లగ్ లో పెట్టి పిన్‌ను సెల్‌ఫోన్‌కు పెడుతుండగా విద్యుత్‌ షాక్‌ తగిలింది. దీంతో ఒక్కసారిగా కుప్పకూలాడు. వెంటనే అతని భార్య చుట్టుపక్కల వారిని పిలిచి మణిని ఆస్పత్రికి తీసుకెళ్తుండగా మార్గం మధ్యలో మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సెల్‌ఫోన్‌ను, చార్జర్‌ను స్వాధీనం చేసుకున్నారు. నిన్న (బుధవారం) మణి మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబసభ్యులకు అప్పగించారు. మణికి భార్య భవాని, పిల్లలు అఖిల్, సురేంద్ర ఉన్నారు. ప్రమాదవశాత్తు మణి మృతి చెందడంతో కుటుంబసభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు.