హైటెక్ మేక.. డ్రై ప్రూట్స్, కూల్‌డ్రింక్స్‌ని ఆహారంగా

మేకలు సాధు జంతువులు. ఆకులు అలములు మాత్రమే తింటాయి. అని కదా మనకు వాటి గురించి తెలిసిన విషయం. కానీ ఆగ్రాలో ఉంటున్న ఈ చైనీస్ మేకకు గడ్డి అంటే ఇష్టం లేదు. తాజా పళ్లు, డ్రై ఫ్రూట్స్‌ని మాత్రమే ఆహారంగా తీసుకుంటుంది. దానికి తోడు చల్లగా ఉండే కూల్ డ్రింక్ కూడా పక్కన ఉండాల్సిందే. ఏడాది వయసున్న ఈ మేక ఇలాంటి ఆహారం తీసుకుని తన బరువుని 70 కేజీలకు పెంచేసింది.

ఓ మీడియా చానెల్‌కి ఇంటర్వ్యూ ఇచ్చిన మేక యజమాని వసీమ్ బక్రీద్ సందర్భంగా మేకను కొంటామంటూ ముందుకు వచ్చినా అమ్మలేదన్నాడు. ఈ మేకకు చైనీస్ అని పేరు పెట్టడంతో అందరూ చైనా నుంచి తీసుకు వచ్చాననుకుంటున్నారని, అయితే దానికి చిన్న చిన్న కళ్లు ఉండడంతో చైనీస్ అని ముద్దుగా పిలుచుకుంటున్నానని తెలిపాడు. తన దగ్గర 150 కేజీల సుల్తాన్ అనే అప్గాన్ జాతి మేక ఉన్నప్పటికీ, వచ్చిన కస్టమర్లు చైనీస్ పట్లే ఆసక్తి చూపుతున్నారని ఆనందంగా చెబుతున్నాడు.

- ఉచితంగా మీ జాతకాన్ని తెలుసుకోండి -