బిగ్‌బాస్ మాజీ కంటెస్టెంట్ భర్త అరెస్ట్

sofia-hayat, former-bigg-boss-contestant-

అడ‌ల్ట్ కంటెంట్‌తో సూపర్ కిక్ ఇచ్చింది హిందీ బిగ్‌బాస్7 రియాలిటీ షో. ఈ షోలో అర్మాన్ కోహ్లీతో గొడవ కారణంగా సిరీస్ మధ్యలోనే వైదొలిగింది సోఫియా హయత్. ఐదేళ్ల తర్వాత మళ్లి తెరపైకి వచ్చింది సోఫియా. ఆమె భర్త అరెస్ట్ ఇప్పుడు సంచలనంగా మారింది.

సోఫియా హయత్ తన బాయ్ ఫ్రెండ్ వ్లాద్ స్టానెస్కును గత సంవత్సరం ఏప్రిల్‌లో లండన్‌లో ప్రేమ వివాహం చేసుకుంది. పెళ్లి తరువాత ఈ జంట యూకేలో నివసిస్తోంది. అయితే కొంతకాలంగా వీరిద్దరి మధ్య విభేదాలు తలెత్తాయి. ఈ నేపథ్యంలో తనను గొంతు నులిమి హత్య చేయబోయాడని ఆరోపిస్తూ వ్లాద్‌పై సోఫియా గత నెలలో ఫిర్యాదు చేసింది. ఆమె కంప్లైంట్‌తో నెలరోజులుగా పోలీసులు వ్లాద్ కోసం గాలిస్తున్నారు. ఇటీవల అతను లండన్‌లోని ఓ పెర్ఫ్యూమ్ షాపులో ఉండగా పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు.