ఘోర రోడ్డు ప్రమాదం : 11 మంది మృతి

హిమాచల్‌ప్రదేశ్‌లోని కులూ జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో 11 మంది మృతి చెందారు. రోహతంగ్‌ జిల్లాలోని రాణి నల్లాలో కొండచరియల గుండా వెళుతున్న కారు అదుపుతప్పి రోడ్డు పక్కనున్న లోయలోకి పడిపోయింది. స్థానికుల సమాచారంతో ప్రమాదస్థలికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు.మృతదేహాలను స్వాధీనం చేసుకోని స్థానిక ఆసుపత్రికి తరిలించారు.