బాబాయ్ ని పెళ్లి చేసుకుందని కుమార్తెను హత్య చేసిన తండ్రి

man-murder-his-doughter-love-marraige

హైదరాబాద్ శివారులో మరో పరువు హత్య జరిగింది. కన్న తండ్రే కూతురి పాలిట కాలయముడయ్యాడు. ప్రేమ వివాహం చేసుకుని.. పరువు తీసిందంటూ కూతురి గొంతు కోసి చంపాడు. ఈ దారుణం హైదరాబాద్‌ శివారు అబ్దుల్లాపూర్‌మెట్‌ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. అబ్దుల్లాపూర్ మెట్‌ కు చెందిన విజయ నాలుగేళ్ల కిందట తనకు బాబాయ్ వరుస అయ్యే సురేశ్‌ ను పెళ్లి చేసుకుంది. తల్లిదండ్రులకు ఇది ఇష్టం లేదు. దీంతో విజయ… వారికి దూరంగా ఉంటోంది. నాలుగు రోజుల కిందట బంధువులు చనిపోతే సురేశ్‌ దంపతులు అబ్దుల్లాపూర్ మెట్‌ వచ్చారు. బాబాయ్‌ వరుస అయ్యే వ్యక్తిని పెళ్లి చేసుకున్నందుకు ఆగ్రహంతో ఉన్న తండ్రి.. ఎవ్వరి లేని సమయంలో కూతురు ఇంటికి వెళ్లాడు. ఆమెను గొంతుకోసి చంపేశాడు. బాబాయ్ వరుస అయ్యే వ్యక్తిని పెళ్లి చేసుకున్నందుకే కూతురిని చంపినట్టు తెలుస్తోంది.