కేరళ వరదవిలయానికి కారణం అదే.. తేల్చేసిన నాసా.. శాటిలైట్ వీడియో విడుదల

nasa-tracks-rain-behind-kerala-floods


భారీ వర్షాలు, వరదలు కేరళను అతలాకుతలం చేశాయి. ఇప్పటికీ ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది, ఆర్మీ, మత్స్యకారులతో పాటు ఇతర ప్రాంతాల నుంచి కూడా వెళ్లి వరదబాధితులకు సహాయ సహకారాలు అందిస్తున్నారు. కేరళ జలవిలయం కారణంగా వందలమంది ప్రాణాలు కోల్పోయారు. లక్షలాది మంది నిరాశ్రయిలైతే.. నీట మునిగిన ఇళ్లకు కొదవే లేదు. 15 రోజులపాటు ప్రకృతి విలయతాండవానికి ప్రతి ఒక్కరు తల్లడిల్లిపోయారు. ఇంతటి ఉపద్రవం సహజసంపదకు నష్టం వాటిల్లడం వలన జరిగిందని కొందరంటుంటే.. వర్షపాతం ఎక్కువగా కురవడం వలెనే జరిగిందని మరొకొందరంటున్నారు. అయితే కేరళ వరద విలయానికి కారణం నైరుతి రుతుపవనాలేనని అంటున్నారు నాసా శాస్త్రవేత్తలు.. నైరుతి రుతుపవనాల ప్రభావంతో బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగానే కేరళ అతలాకుతలమైందని నాసా తేల్చింది. ఈ మేరకు భారతదేశవ్యాప్తంగా వర్షపాతాన్ని లెక్కిస్తూ ఉపగ్రహాన్ని ఉపయోగించి తీసిన వీడియోను విడుదల చేసింది నాసా. ఈనెల 13 నుంచి 20 వరకు భారత్‌లో కురిసిన వర్షపాతాన్ని నాసా రెండు భాగాలుగా విభజించింది. అందులో మొదటి భాగంలో ఉత్తర భారతదేశంలోని సరిహద్దుల మీదుగా సుమారు 5సెంటిమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక రెండోది పశ్చిమాన ఉన్న తూర్పు బంగాళాఖాతం వెంబడి 14అంగుళాల వర్షపాతం నమోదైంది. మొదటి వర్గాన్ని సాధారణంగా వచ్చే వర్షపాతంగానే లెక్కగట్టిన నాసా రెండోది మాత్రం ఎన్నడూ లేని విధంగా అక్కడ అల్పపీడనం నమోదైనట్లు తేల్చి చెప్పింది.

- ఉచితంగా మీ జాతకాన్ని తెలుసుకోండి -