సంచలనం రేపిన కబడ్డీ సంఘం మాజీ కార్యదర్శి ఆత్మహత్యాయత్నం


ఏపీ కబడ్డీ సంఘం అధ్యక్షుడు వీర్ల లంకయ్య తనపై కక్ష సాధిస్తున్నారంటూ… కృష్ణా జిల్లా కబడ్డీ సంఘం మాజీ కార్యదర్శి యలమంచలి శ్రీకాంత్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం సంచలనం రేపింది… తన టీం సభ్యులను సెలక్ట్‌ చేసుకోకుండా కబడ్డీకి దూరం చేస్తున్నారని ఆరోపించారు… దీంతో తాను మనస్థాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు శ్రీకాంత్ పేర్కొన్నారు.

ఆత్మహత్యాయత్నానికి ముందు శ్రీకాంత్.. సెల్ఫీ వీడియో తీసుకొని తాను సూసైడ్ ఎందుకు చేసుకోవాలనుకుంటున్నాడో వివరించారు. ముఖ్యమంత్రిపై గౌరవం ఉందని, తనపట్ల జరుగుతున్న అన్యాయాన్ని ఎన్నిమార్లు సీఎం దృష్టికి తీసుకెళ్లినా లాభం లేకుండా పోయిందన్నారు…

లంకయ్య తన టీమ్‌కు అవకాశం కల్పించడం లేదని దీనిపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశాడు శ్రీకాంత్‌… అనంతరం పురుగుల మందు తాగి ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డాడు. ఆయనను హుటాహుటిన ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు… ప్రస్తుతం శ్రీకాంత్ ICUలో ఉన్నాడు. కొన్ని నెలల క్రితం కూడా లంకయ్య, శ్రీకాంత్‌ ఇద్దరూ ఆరోపణలు గుప్పించుకున్నారు.