కీచక మాస్టారు.. మార్కులు కావాలంటే..

student-accuses-tamil-nadu-professor-of-sexual-harassment

మాష్టార్లు ఇలా ఎందుకు మారుతున్నారు.. గురువులు విద్యార్థుల పట్ల చూసే దృష్టి మారుతోంది.. విద్యాబుద్దులు నేర్పాల్సిన గురువులు ప్రేమ పాఠాలు వల్లిస్తున్నారు.. కోర్కె తీర్చమంటూ వేధిస్తున్నారు.. తమిళనాడులోని తిరువణ్ణామలై జిల్లాకు చెందిన వాళవచ్చనూర్ ప్రభుత్వ వ్యవసాయ కళాశాలలో ఓ యువతి బీఎస్సీ చదువుతోంది. అదే కాలేజీలో మధురైకి చెందిన తంగపాండియన్ అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నాడు. ఆమెపై కన్నేసిన ప్రొఫెసర్ లైంగికంగా వేధించసాగాడు. లొంగదీసుకునేందుకు ప్రయత్నించాడు. కాలేజీలో ఉన్నప్పుడే కాకుండా రాత్రిళ్లు ఆమె ఉంటున్న హాస్టల్‌కి వెళ్లి మరీ వేధించడం మొదలు పెట్టాడు.

student-accuses-tamil-nadu-professor-of-sexual-harassment

వార్డెన్లు కూడా అతడికి సహకరించే వారు. తాను చెప్పినట్టు విని, తన కోర్కె తీరిస్తే మంచి మార్కులు వేస్తానని, ఇదే కాలేజీలో ఫ్యాక్టలీగా చేరేందుకు సహకరిస్తానని ఆమెపై ఒత్తిడి తీసుకువచ్చాడు. తనకు పెళ్లై భార్య ఉన్నా రెండో భార్యగా చేసుకుంటానని వార్డెన్ల చేత చెప్పించాడు. ముందునుంచి ప్రొఫెసర్ వెకిలి చేష్టలు భరిస్తూ వచ్చిన యువతి అతడి ఆగడాలను, ఫోన్ కాల్స్‌ని రికార్డు చేయడం మొదలు పెట్టింది. రాను రాను వేధింపులు హద్దు మీరడంతో భరించలేక తల్లిదండ్రుల సహాయంతో పోలీసులకు తెలియజేసింది. విషయం తెలుసుకున్న ప్రొఫెసర్‌ పాండియన్ పరారీలో ఉన్నాడు. అతడికి సహకరించిన ఇద్దరు హాస్టల్ వార్డెన్లను పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. పాండియన్ కోసం పోలీసులు గాలిస్తున్నారు.