ఆంధ్రప్రదేశ్‌కు చేరుకున్న వాజ్ పేయి అస్తికలు

Vajpayee's ashes came in Andhra Pradesh

మాజీ ప్రధాని వాజ్‌పేయి చితాభస్మ కలశాలతో దేశవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో యాత్రలు నిర్వహించి… అన్ని నదుల్లో నిమజ్జనం చేయాలని బీజేపీ నిర్ణయించింది. ఢిల్లీలో చితాభస్మ కలశాలను పార్టీ రాష్ట్ర అధ్యక్షులకు ప్రధాని నరేంద్ర మోడీ, జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా అందజేశారు. రాష్ట్రాల్లో రాజధాని నుంచి అస్థి కలశ యాత్ర ప్రారంభమై అన్ని బ్లాకుల గుండా సాగుతాయని బీజేపీ నేతలు తెలిపారు.

వాజ్ పేయి అస్తికలు ఆంధ్రప్రదేశ్‌కు చేరుకున్నాయి. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ నేతృత్వంలో ఢిల్లీ వెళ్లిన నేతలు… చితాభస్మ కలశంతో రాష్ట్రానికి చేరుకున్నారు. గన్నవరం విమానాశ్రయం నుంచి అస్తికలను ర్యాలీగా పార్టీ ఆఫీసుకు తీసుకెళ్లారు. వాజ్‌పేయి అస్తికలను రాష్ట్రంలోని నాలుగు నదుల్లో నిమజ్జనం చేయినున్నారు.

అటు.. వాజపేయి చితాభస్మం హైదరాబాద్ చేరుకుంది. చితాభస్మ కలశాన్ని రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో ఉంచారు. ఢిల్లీ నుంచి రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్, ఎంపీ దత్తాత్రేయ చితాభస్మ కలశాన్ని తీసుకువచ్చారు. అభిమానులు, పార్టీ కార్యకర్తలు, ప్రజల సందర్శనార్థం… ఇవాళ ఉదయం 11 గంటల వరకు వాజ్‌పేయి చితాభస్మ కలశాన్ని కార్యాలయంలో ఉంచుతారు. అనంతరం పార్టీ నేతలు రెండు బృందాలుగా ఏర్పడి.. ఆయన అస్తికలు, చితాభస్మాన్ని కృష్ణా, గోదావరి, మూసీ, నదుల్లో నిమజ్జనం చేయనున్నారు. లక్ష్మణ్‌, మురళీధర్‌రావు నేతృత్వంలో ఓ బృందం… నిర్మల్ జిల్లా బాసర దగ్గర గోదావరి న‌దిలో వాజ్‌పేయి అస్తికలు నిమజ్జనం చేయనుంది. ఎంపీ దత్తాత్రేయ, ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి ఆధ్వర్యంలో మరో బృందం చేవెళ్ల, వికారాబాద్ మీదుగా అనంతగిరి వెళ్లి మూసి సంగమంలో నిమజ్జనం చేస్తారు.

మరోవైపు రేపు, ఎల్లుండి తెలంగాణవ్యాప్తంగా వాజ్‌పేయ్ సంతాపసభలను నిర్వహించనున్నారు. 24న హైదరాబాద్‌లో నిర్వహించే సంతాపసభకు అన్ని రాజకీయ పార్టీల నేతలను ఆహ్వానించనున్నారు. అదే విధంగా 25న రాష్ట్రంలోని అన్ని అసెంబ్లీ కేంద్రాల్లో నిర్వహించే సంతాపసభలు జరుగుతాయి.

- ఉచితంగా మీ జాతకాన్ని తెలుసుకోండి -