వాషింగ్ మిషన్ పక్కన 8 అడుగుల నాగుపాము

భయంకరమైన విషసర్పాలు ఈ మధ్య ఇళ్లలోకి వస్తున్నాయి. మనుషుల్ని భయపెడుతున్నాయి. విశాఖ జిల్లా కశింకోట పాల కేంద్రం వీధిలో నివాసం ఉంటున్న భీమరశెట్టి ముసిలినాయుడు ఇంట్లోని వాషింగ్ మిషన్ పక్కన నాగుపాము కనిపించింది. పాముని చూసిన ఇంట్లోని వారు భయంతో బయటకు పరుగులు తీశారు.

చుట్టుపక్కల వారు వచ్చి కర్రలు పట్టుకుని హడావిడి చేయడంతో నాగుపాము పడగ విప్పి బుసలు కొట్టింది. అక్కడే ఉన్న కొందరు పాములు పట్టేవారికి సమాచారం అందించడంతో అనకాపల్లి బీఆర్టీ కాలనీ నుంచి పాములు పట్టేవారు వచ్చి దాన్ని పట్టుకున్నారు.