హాఫ్‌ సెంచరీ దాటిన త్రిష.. ’96’ లో స్కూల్ టీచర్

trisha

సినిమా ఫీల్డ్‌లో లీడ్‌ యాక్ట్రస్‌గా పదిహేను సంవత్సరాలు పూర్తి చేసుకుంది చెన్నై సుందరి త్రిష. తన కెరీర్‌లో త్రిష హాఫ్‌ సెంచరీ మైలురాయిని దాటింది. తాజాగా త్రిష నటిస్తున్న చిత్రం 96. త్రిష 59వ చిత్రంగా వస్తోన్న ఈ మూవీపై అభిమానులలో భారీ ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి. థ్రిల్లర్ ఎంటర్‌టైనర్‌గా వస్తున్న ఈ మూవీలో త్రిష స్కూల్ టీచర్‌గా నటిస్తున్నట్లు టాక్.

మద్రాస్ ఎంటర్ ప్రైజెస్ బ్యానర్ పై నంద గోపాల్ నిర్మిస్తున్న ఈ మూవీ ట్రైలర్‌ని చిత్ర బృందం విడుదల చేశారు. విజయ్ సేతుపతి, త్రిషల చిన్నతనం సీన్స్ తో పాటు వారు ఎదిగిన తర్వాత ఇద్దరు ఒక్కటిగా ఎలా అయ్యారు అనేది ట్రైలర్ లో చూపించారు. ప్రేమ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీని
సెప్టెంబర్ 13న రిలీజ్ చేయనున్నారు.

- ఉచితంగా మీ జాతకాన్ని తెలుసుకోండి -