కేరళ కోసం బిగ్‌బీ భారీ విరాళం

కేరళ వరద భాదితుల కోసం ప్రముఖుల విరాళాలు కొనసాగుతున్నాయి. తాజాగా బిగ్‌బి అమితాబచ్చన్ భారీ విరాళం ప్రకటించడమే కాకుండా వ్యక్తిగత వస్తువులను కూడా దానం చేశారు. వరదల చిక్కుకున్న వారిని రక్షించేందుకు కృషి చేస్తున్న సంస్థలకు అండగా ఉండేందుకు బాలీవుడ్ సూపర్‌స్టార్ అమితాబ్ బచ్చన్ రూ.51 లక్షల భారీ విరాళాన్ని ప్రకటించారు. అలాగే తన వ్యక్తిగత వస్తువులైన 25 ప్యాంట్స్, 20 షర్టులు 50 జాకెట్ల,40 జతల షూస్‌ను రసూల్ పొకుట్టి ఫౌండేషన్‌కు అందజేశారు.