గీతా మాధురి గోముగా అడిగితే కౌశల్..

బిగ్‌బాస్ హౌస్‌లో మరో లవ్ జంట సందడి చేస్తోంది. గీత కౌశల్ వెంట పడుతున్నా కాదు పొమ్మంటున్నాడు. టాస్క్‌లో భాగంగా కౌశల్‌ని లవ్‌లో పడేయాలి. కానీ గీత ఎంత గోముగా అడిగినా కౌశల్ మనసు కరగలేదు. ప్రేమా గీమా అంటూ వెంట పడ్డావంటే ఎలిమినేట్ చేస్తా అంటూ వార్నింగ్ ఇచ్చినా గీత మాత్రం మరింత ప్రేమని కురిపించింది. ఎలా అయినా పడేద్దామనుకుంది కానీ కౌశల్ నేను బిగ్‌బాస్‌ని నన్ను పడేయడం ఎవరి వల్లా కాదంటూ గీత లవ్ ప్రపోజల్‌ని తిరస్కరించాడు. ఇదంతా ‘నీవెవరో ‘ప్రమోషన్ కోసం వచ్చిన ఆది పినిశెట్టి టీమ్ ముందు గీత, కౌశల్ చేసిన టాస్క్ బుల్లి తెర ప్రేక్షకులకు కాసేపు వినోదాన్ని పంచింది.