2.4 కిలోల చికెన్ ధర 1,46,00,000…చెత్త కుండీలో డబ్బులు

దక్షిణ అమెరికా తీరంలోని వెనిజులా దేశం తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయింది. ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న వెనిజులలో ద్రవ్యోల్బణనికి అడ్డు అదుపు లేకుండా పోవడంతో లోకల్ కరెన్సీ అయిన బాలివర్లకు విలువ లేకుండా పోయింది. పెట్రోల్‌ ఉత్పత్తులు ధరలు క్రాష్‌ కావడంతో మొదలైన సంక్షోభం
ఢొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్ష పదవి చేపట్టక ద్రవ్యోల్బణం తార స్థాయికి చేరింది.

అందుబాటులో లేని ధరలతో… జనాలకు సరిగా తిండి లేకుండా పోయింది.2.4 కిలోల చికెన్ కొనాలంటే వెనిజులా కరెన్సీ బాలివర్లులో కోటి 46 లక్షల చెల్లించాల్సిందే. చికెన్‌ను లోకల్ కరెన్సీలో కొనాలంటే చిన్న నోట్లలో అంత మొత్తం చెల్లించాలని ఓ దుకాణాదారు డిస్‌ప్లే ఏర్పాటు చేశాడు. మన కరెన్సీలోదాన్నిపోలిస్తే కేవలం నూటాయాభై రూపాయలే. అమెరికా కరెన్సీలో అయితే అది 2.22 డాలర్లు మాత్రమే. చిన్నచితకా నోట్లకు విలువ లేకుండా పోయింది.వాటిని జనం చెత్తకుండీల్లో వేస్తున్నారు.ప్రస్తుతం వెనిజులా ఇంతటి దారుణమైన పరిస్థితిని ఎదుర్కొంటోంది.

Image result for Venezuela cuts five zeros from currency in confusing strategy