దాసు ఏంటీ సంగతి : నాగార్జున

nagarjuna and nani, nani, nag, devdas

శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో ‘కింగ్’ నాగార్జున‌, నేచుర‌ల్ స్టార్ నాని మల్టిస్టారర్‌గా న‌టిస్తున్న చిత్రం ‘దేవ‌దాస్’. వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై అశ్వ‌నీద‌త్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్ర టీజర్‌ శుక్రవారం విడుదలైంది. టీజర్‌లో నాగ్‌, నాని కలిసి మందేయడం అందరిని ఆకట్టుకుంటుంది. నాగార్జున ముందు నాని ఇచ్చిన అమాయక ఎక్స్‌ప్రెషన్స్‌.. దాసు ఏంటీ సంగతి అని నాగ్‌ చెప్పిన డైలాగ్‌ చూస్తుంటే ఈ సినిమా మీద భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆకాంక్షా సింగ్, రష్మికా మండన్నా హీరోయిన్లుగా నటిస్తున్న ఈ మూవీకి మణిశర్మ స్వరాలు అందిస్తున్నారు. ఈ మూవీని సెప్టెంబర్‌ 27న రిలీజ్‌ చేయటానికి దర్శకనిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.

Recommended For You

Leave a Reply

Your email address will not be published.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.