ఈనెల 28 తర్వాత ఏపీ మంత్రి వర్గ విస్తరణ?

Expansion of AP Ministerial after 28

ఈనెల 28 తర్వాత ఏపీ మంత్రి వర్గ విస్తరణ జరిగే అవకాశాలు కన్పిస్తున్నాయి. 28న గుంటూరులో మైనారిటీ సదస్సు ఉంది.. ఐతే.. 28 తరువాత ఏ రోజు మంచి ముహూర్తం ఉంటే ఆ రోజు కేబినెట్ విస్తరణ జరుగుతుందనే వార్తలు వస్తున్నాయి. మైనారిటీ వర్గాలకు మంత్రివర్గంలో ప్రాతినిధ్యం కల్పించాలని సీఎం నిర్ణయించడంతో.. పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ షరీఫ్‌ను కేబినెట్‌లోకి తీసుకునే అవకాశం ఉంది. కేబినెట్‌లో రెండు ఖాళీలు ఉన్నా ప్రస్తుతానికి మైనార్టీ నేతకే చోటు కల్పించనున్నారు. ఇటీవల గవర్నర్‌ను సీఎం చంద్రబాబు కలిసి సందర్భంలో కేబినెట్‌ విస్తరణ అంశం ప్రస్తావనకు వచ్చింది.

- ఉచితంగా మీ జాతకాన్ని తెలుసుకోండి -