40,000 ఏళ్ల క్రితం మృతి చెందిన గుర్రపు పిల్లను గుర్తించిన శాస్త్రవేత్తలు

రష్యన్ శాస్త్రవేత్తలు సైబీరియన్ మంచు శిఖర ప్రాంతంలో 40,000 ఏళ్ల క్రితం మృతి చెందిన గుర్రం పిల్ల కళేబారన్ని కనుగొన్నారు. తాజాగా దీనికి సంబంధించిన చిత్రాలను విడుదల చేశారు. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అంతరించిపోయిన లీనా జాతికిచెందిన గుర్రం పిల్లగా శాస్త్రవేత్తలు తెలిపారు. 37 అంగుళాలు పొడవు ఉన్న గుర్రపు పిల్ల మరణించిన సమయంలో రెండు నెలల వయస్సు మాత్రమే ఉన్నట్లు తెలిపారు. ‘మౌత్ ఆఫ్ హెల్’ పర్వత ప్రాంతంలో దీనిని గుర్తించారు.