భారీ కలెక్షన్స్ సాధించిన ‘గీత గోవిందం’

geetha-govindam-box-office-collection-profits

విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా జంటగా నటించిన గీత గోవిందం కలెక్షన్స్ మోత మోగిస్తోంది. సూపర్ హిట్ టాక్ వచ్చినా కొన్ని సినిమాలు మూణ్నాలుగు రోజుల తర్వాత కలెక్షన్స్ డ్రాప్ అవుతాయి. కానీ గీతగోవిందం కలెక్షన్స్ విషయంలో ఇది జరగడం లేదు. ఎనిమిది రోజులైనా ఏ మాత్రం తగ్గకుండా బాక్సాఫీస్ ను షేక్ చేస్తోందీ సినిమా. ఇప్పటికే డబుల్ ప్రాఫిట్స్ తెచ్చిన గీత గోవిందం తొమ్మిది రోజుల తర్వాత కూడా స్టడీగా ఉండటం విశేషం. ఆగస్టు 15 సందర్భంగా విడుదలైన ఈ చిత్రం మళ్లీ గురువారం(నిన్న) నాటికి ఏకంగా రూ. 75.50 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్టు ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. ఇందులో షేర్ 37 నుంచి 40 కోట్ల వరకు ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. అయితే ఒక్క బక్రీద్ పండగ రోజే ప్రపంచ వ్యాప్తంగా రూ. 8.50 కోట్ల గ్రాస్ వసూలు చేసింది.