
బుల్లితెర హాట్ యాంకర్ రష్మీ వెండితెరపై కూడా అందాలు ఆరబోస్తూ సందడి చేస్తోంది. ఓ ఛానెల్లో వస్తున్న బిగ్‌బాస్ షో గురించి మాట్లాడుతూ హౌస్‌లోని సభ్యుల్లో చాలా మంది తనకు తెలిసిన వారేనంది. అయితే షో రెగ్యులర్‌గా చూడ్డానికి సమయం కుదరదని, అందుకే సోషల్ మీడియాని ఫాలో అవుతుంటానని చెప్పింది.
నందిని, కౌశల్ తనకు మంచి స్నేహితులని చెప్పింది. బయట కౌశల్ ఆర్మీ పేరుతో ఆడియన్స్‌లో మంచి క్రేజ్‌ని సంపాదించాడని, దీన్ని బట్టి చూస్తే కౌశల్ గెలుపు ఖాయమని అంటోంది. ఒకవేళ కౌశల్ బిగ్‌బాస్ విన్నర్ కాలేదంటే ఫ్యాన్స్ ధర్నాలు చేసేస్తారేమోనంటూ సరదాగా చమత్కరించింది. అయితే ఈ వారం ఎలిమినేషన్లో కౌశల్ ఉండడం ఫ్యాన్స్‌ని కొంత నిరాశకు గురిచేస్తోంది. ఈ సస్పెన్స్‌కు తెర దించాలంటే మరో రెండు రోజులు ఆగాల్సిందే.