వరద బాధితులకు నేను సైతం.. ఓ కప్పు గరం చాయ్.. వైరల్

ఆపదలో ఉన్న వారికి ఏ చిన్న సాయమైనా ఎంతో ఊరటనిస్తుంది. చిన్నారులను సైతం కదిలించి చిన్న సాయమైనా చేయడానికి పురిగొల్పుతుంది. బాధితులకు అందించే గుక్కెడు నీళ్లైనా వారికి ప్రాణం లేచి వస్తుంది. మా వృత్తి ఏదైనా మాకూ స్పందించే మనస్సుదంటూ ప్రతి ఒక్కరూ కదిలి వస్తున్నారు.

చాయ్‌లు అమ్ముకునే ఓ వ్యక్తి కూడా చుట్టూ నీళ్లున్నా అందులోనే చిన్న చాయ్ బట్టీ ఏర్పాటు చేశాడు. కాలు కదపకుండా బాధితులకు వేడి వేడి చాయ్ అందిస్తున్నాడు. ఓ ట్రేలో చాయ్ గ్లాసులు పెట్టి నీటిలోకి తోస్తూ చాయ్ అందించే విధానం చూపరులను ఆకట్టుకుంటోంది. ఇప్పుడిది సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

- ఉచితంగా మీ జాతకాన్ని తెలుసుకోండి -