ఇప్పుడు అతడి టైమ్ నడుస్తుంది : మహేష్

mahesh babu

‘పెళ్లిచూపులు’ మూవీతో తెలుగు ప్రేక్షకులని ఆకట్టుకున్నాడు యంగ్ హీరో విజయ్ దేవరకొండ. ‘అర్జున్ రెడ్డి’ మూవీతో సెన్సేషనల్ స్టార్‌గా ఎదిగిపోయాడు. తన యాక్టింగ్‌తో యూత్‌లో మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు. ‘గీత గోవిందం’ చిత్రంతో ఫ్యామిలీ ఆడియన్స్ కూడా దగ్గరయ్యాడు ఈ గోవిందుడు. తన తోటి హీరోలతో కలివిడిగా మెలుగుతూ అందరి అభిమానాన్ని చూరగొంటున్నాడు. ఇటు మెగాఫ్యామిలీని కలిసిన ఈ యంగ్ హీరో‌.. ఈ మధ్యనే ప్రిన్స్‌ మహేష్‌ బాబును కూడా కలిశాడు.

మహేష్‌ను కలిసిన తరువాత విజయ్ ఆనందంతో ఓ ట్వీట్ చేశాడు. విజయ్ చేసిన ట్వీట్‌కు మహేష్ రిప్లై ఇవ్వడంతో అది కాస్తా వైరల్‌గా మారింది. ఇంతకీ మహేష్ ఇచ్చిన రిప్లై ఎంటా అనుకుంటున్నారా! ‘ఇది విజయ్‌ దేవరకొండకు మంచి సమయం.. ఇప్పుడు అతని టైమ్‌ నడుస్తోందంటూ పోస్ట్ చేశాడు. ఈ క్రమంలోనే హాలిడేను ఎంజాయ్‌ చేయమంటూ’ విజయ్‌కు విషెస్‌ తెలిపాడు మహేష్. దీంతో నెటిజన్ల్ విజయ్ హిట్‌లు మీద హిట్‌లు కొడుతున్నాడంటూ కామెంట్ల్ చేస్తున్నారు.