సీఎం బామ్మర్దిని.. నన్నే పట్టుకుంటారా!

man-claiming-to-be-a-brother-in-law-of-cm-shivraj-created-ruckus-near-vidhan-sabha-in-bhopa

తాను సీఎం బామ్మర్దిని అంటూ ఓ వ్యక్తి హల్‌చల్ చేశాడు. ‘నేను ఎవరో తెలుసా! ముఖ్యమంత్రి బామ్మర్దిని.. నాకే జరిమానా విధిస్తారా’ అంటూ మధ్యప్రదేశ్ రాష్ట్ర విధాన సభ ముందు ఓ వ్యక్తి ఆందోళన చేశాడు. ట్రాపిక్ నిబంధనలు ఉల్లంఘించిన అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో తాను సీఎం శివరాజ్ సింగ్ చౌహన్ బామ్మర్దిని అంటూ వీరంగం సృష్టించాడు. పోలీసులను అసభ్య పదజాలంతో దూషించాడు.

ఈ ఘటనపై సీఎం చౌహాన్ స్పందించారు. రాష్ట్రంలో తనకు కోట్లాది మంది అక్కచెల్లెళ్లు ఉన్నారు. వారి భర్తలందరూ తనకు బావబామ్మర్దులు అవుతారంటూ ఛలోక్తులు విసిరారు.

Recommended For You

Leave a Reply

Your email address will not be published.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.