తండ్రి కాదు కామాంధుడు.. కన్నకూతుళ్లపైనే అత్యాచారం

man rape his doughters in shamshabad

తండ్రి బిడ్డలను కంటికి రెప్పలా కాపాడుతుంటాడు. కానీ శంషాబాద్‌లో ఓ తండ్రి కామాంధుడిగా మారాడు. కాపాడాల్సిన కన్నకూతుళ్లనే చెరిచాడు. ఏడాదికాలంగా పలుమార్లు అత్యాచారం చేస్తూనే ఉన్నాడు. తాగిన మైకంలో పశువులా ప్రవర్తించే అతడి వికృతచేష్టలతో విసిగివేసారిన భార్య పోలీసులకు ఫిర్యాదు చేయడంతో దారుణం వెలుగుచూసింది.

బతుకుదెరువు కోసం నేపాల్‌ కు చెందిన ఓ వ్యక్తి, భార్య, ఇద్దరు పిల్లలతో శంషాబాద్‌కు వచ్చాడు. అతను సెక్యూరిటీ గార్డ్‌గా పనిచేస్తున్నాడు. మద్యం తాగినప్పుడు అతనిలో పశువు నిద్ర లేచేవాడు. కూతుళ్లతో అసభ్యంగా ప్రవర్తించేవాడు. పలుమార్లు అత్యాచారం కూడా చేశాడు. తండ్రి చేస్తున్న దారుణం గురించి కూతుళ్లు తల్లితో చెప్పడంతో ఆమె భర్తను నిలదీసింది. దీంతో అతను బీహార్ కు వెళ్లిపోయాడు. కొన్నాళ్లు అక్కడే ఉన్న ఆ కామాంధుడు మళ్లీ శంషాబాద్‌ తిరిగివచ్చాడు. బుద్ధిగా ఉంటానని నమ్మబలికాడు. అయితే అతనిలో మార్పు రాలేదు. ఎప్పటిలాగే కూతుళ్లపై అత్యాచారం చేస్తున్నాడు. దీంతో భార్య భర్తపై శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు నిందుతున్ని అరెస్ట్‌ చేశారు. అతనిపై నిర్భయ, ఫోక్సో చట్టం కింద కేసులు నమోదు చేశారు.