కేరళకు ‘సన్నీలియోన్’ సాయం

sunny leone

గతంలో వచ్చిన సునామీ, వరదలు, భూకంపాలకన్నా ఇప్పుడు కేరళను ముంచెత్తిన జల ప్రళయం ఎక్కువ తీవ్రమైనది. కేరళలో కొన్ని వందల మంది మరణించడమే కాకుండా పది లక్షల మందికి పైగా ప్రజలు నిరాశ్రయులయ్యారు. వరద బాధితుల కోసం ప్రతి ఒక్కరు సాయం చేస్తూ మానవత్వం చాటుతున్నారు. కొందరు సెలబ్రెటీలు తమ వంతు సాయం చేస్తూ బాధితులకు అండగా నిలబడుతున్నారు. అయితే కొందరు అభిమానులు తమ సెలబ్రెటీలు ఎక్కువ మొత్తంలో సాయం చేసినట్లు సోషల్ మీడియా వేదికగా అసత్య ప్రచారం చేస్తున్నారు. అందులో సన్నీలియోన్‌ని కూడా చేర్చారు ఫ్యాన్స్. ఆమె వరద బాధితులకు రూ. 5 కోట్లు సాయం చేశారంటూ ప్రచారం చేశారు.

అయితే సన్నీ మాత్రం కేరళ వరద బాధితులకు కావాల్సింది ఇస్తున్నానని తన ఇన్‌స్టాగ్రామ్‌లో పేర్కొంది. భర్త డానియెల్‌ వెబర్‌, మరికొంత మంది బాలీవుడ్‌ స్నేహితుల సాయంతో 1200 కేజీల రైస్‌, పప్పు(1.3 టన్నులు)ను పంపించింది.